1682 కుటుంబాలకే వంద రోజుల పని..

– లక్ష్యం చేరని ఉపాధి పనులు..
– కూలీలకు 100 రోజుల పని కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం..
– జాబ్‌ కార్డులను సద్వినియోగం చేసుకోలేక పోతున్న కూలీలు..
– 64.89 లక్షల పనిదినాలకు 55 లక్షల పనిదినాలు పూర్తి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఉపాధి హామీలు భాగంగా జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వందరోజుల పని కల్పించవలసి ఉండగా కేవలం 1682 కుటుంబాలకే వంద రోజుల పని కల్పించి లక్ష్యం లక్ష్యానికి దూరంగా మారారు. గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించి,వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం జిల్లాలో మందకొండిగా సాగుతూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చుతున్నది. యాసంగి వరి నాట్ల అనంతరం పల్లెల్లో వ్యవసాయ పనులు అంతగా లేనప్పుడు కూలీలు ఉపాధి హామీ పనుల వైపు చూస్తారు. కాని ఈ ఏడాది అధికారులు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేక పోయారు. ఈ ఆర్దిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 64.89 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 55 లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలోనే 13వ స్థానంలో కొనసాగుతున్నారు.ఈ ఏడాది లో 1,83,547 కుటుంబాలకు అధికార యంత్రాంగం పని కల్పించింది. ఇందులో 1682 కుటుంబాలకే వందరోజుల పని కల్పించారు.
ఉపాధి లక్ష్యం 64.89 లక్షల పనిదినాలు..
సూర్యాపేట జిల్లాలో ఉపాధి హామీ పనులు లక్ష్యం చేరేలా లేదు. జిల్లా పరిధిలో 475 గ్రామ పంచాయతీల వారీగా పనులను గుర్తించిన యంత్రాంగం 64.89 లక్షల పని దినాలు కూలీలకు కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. జాబ్‌కార్డు ఉన్న వారందరికీ పనులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు. కాని  ఆర్థిక సంవత్సరం పూర్తయ్య నాటికి 55 లక్షల పని దినాలు మాత్రమే కల్పించారు.84.75 శాతం లక్ష్యం చేరుకున్నారు.
3,46,086 కూలీలకు మాత్రమే పని..
జిల్లాలోని 23 మండలాల పరిధిలో జాబ్‌కార్డు కలిగిన కుటుంబాలు 2,61,192 ఉండగా, 5,69,350 మంది కూలీలు ఉన్నారు.  2023–24 సీజన్‌లో  1,83,547 కుటుంబాల్లో 3,46,086 మంది కూలీలు పని కల్పించారు. ఈ ఆర్దిక సంవత్సరంలో 159.17 కోట్ల రూపాయిలు ఉపాధి హామీలో ఖర్చు చేయగా 96.45 కోట్ల రూపాయలు కూలీలకు వేతనంగా చెల్లించారు.జిల్లా వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కేవ
Spread the love