నవతెలంగాణ – ఆర్మూర్
క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో వన్ నేషన్, వన్ ఎలక్షన్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. వన్ నేషన్, వన్ ఎలక్షన్” అనేది భారతదేశంలో పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదన. ప్రస్తుతం, భారతదేశంలో లోక్ సభ ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరుగుతున్నాయి. దీనివల్ల రాజకీయ అస్థిరత, అధిక వ్యయం, పరిపాలనా సమస్యలు వస్తున్నాయని భావిస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే పాండే, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.