
చేపల వేటకు వెళ్లి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన గాంధారి మండలంలో చోటు చేసుకుంది. గాంధారి మండలం లోని రాంపూర్ గడ్డ కు చెందిన రత్లావత్ హరి s/o పంత్య వయసు 40 సంవత్సరాలు. నిన్న రాత్రి సమయంలో ఇంట్లో గల దోమల తెరను తీసుకొని వెళ్లి చేపల కోసం పెద్దపోతంగాల్ గ్రామంలో ని యాతం చెరువు నందు చేపల కోసం చెరువులో దిగగా చెరువులో పెద్ద పెద్ద గుంతలు ఉండటం వలన అతనికి ఈత కూడా రాకపోవడం వలన అందులో పడి చనిపోయినాడు. భార్య సాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు మృతుడి కి ఇద్దరు పిల్లలు ఉన్నారు.