అత్యాచారయత్నం కేసులో ఒకరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష

నవతెలంగాణ – సిరిసిల్ల
బాలిక పై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2000 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించినట్లు పట్టణ సి.ఐ రఘుపతి తెలిపారు. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణానికి చెందిన 10సంవత్సరాలు బాలికపై   2023 సంవత్సరంలో ఒంటరిగా ఇంటికి వెళ్ళుచున్న సమయంలో రాజీవ్ నగర్ కు చెందిన  కొండ రాహుల్ అనే వ్యక్తి బాలికను హత్యాచారం చెయ్యాలనే ఉద్దేశంతో అ పాపను పక్కనే వున్న సంద్దిలోకి తీసుకొని వెళ్ళి ఆమెపై హత్యాచారనికి పాల్పడగా ఆ పాప అతని నుండి తప్పించుకొని వచ్చి వాళ్ళ తాతకు జరిగినా సంఘటన గురించి చెప్పగా అతను ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ తల్లికి అప్పగించి జరిగినా సంఘటన  గురించి పాప యొక్క తల్లికి చెప్పగా పాప యొక్క తల్లి సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు  చేయగా పిర్యాదు మేరకు అప్పటి సిరిసిల్ల పట్టణ సీఐ అనిల్ కుమార్ నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పి.పి. పెంట శ్రీనివాస్ వాదించగా, కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కానిస్టేబుల్లు మహేందర్, డి.నరేందర్, లు కోర్టులో 13 మంది సాక్షులను  ప్రవేశపెట్టారు. పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి  మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 2000/-  రూపాయల జరిమానా విధించినట్లు సీఐ బి.రఘుపతి తెలిపారు.

Spread the love