ఒకే దఫా రుణమాఫీ కాంగ్రెస్ తోనే సాధ్యం: ముప్ప గంగారెడ్డి

నవతెలంగాణ – మోపాల్ 

రుణమాఫీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సందర్భంగా మండల కేంద్రంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి మరియు మండల అధ్యక్షుడు సాయి రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో బాలసంచాలు కాల్చి మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కర్షక ప్రభుత్వం అని రైతు సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతుందని అందులోనే భాగంగా ఒకేసారి ఏక మొత్తంలో రూ.31 వేల కోట్లతో  నలభై ఏడు లక్షల మందికి రుణమాఫీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదే చేస్తుందని చేసేదే చెప్తుందని ఆయన తెలిపారు. అలాగే శ్రీమతి సోనియా గాంధీ పుట్టిన రోజైనా డిసెంబర్ 9వ తేదీని రుణమాఫీ కట్ ఆఫ్ తేదీగా ప్రకటించిందని తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు, రాహుల్ గాంధీకి రైతు బాధలు తెలుసు కాబట్టి వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించాడని దానికి అనుగుణంగా ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా రుణమాఫీ చేస్తున్నామని, ఒకప్పుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకకాలంలో లక్ష రుణమాఫీ చేసామని దానికనుగుణంగాప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకేదాఫా రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తున్నాడని, ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని నాలుగు విడతలు, వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను సంక్షోభం వైపు తీసుకెళ్లి అన్నదాతల ఆత్మహత్యలకు కారణమైంది గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కానీ మా ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ పార్లమెంటు ఎన్నికలు రావడంతో రెండున్నర నెలలు ఎలక్షన్ కోడ్ తో గడిచిపోయాయి. అయితే 8 నెలల్లోపే సామాజిక బాధ్యతతో రుణమాఫీ చేస్తుంది ఆయన తెలిపారు. అలాగే జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో సంబరాలు చేయాలని ఆయన విన్నవించారు. అలాగే రైతు భరోసా విషయంలో కూడా రైతులకు ఎటువంటి సందేహం లేదని కచ్చితంగా రైతు భరోసా డబ్బులు అతి తొందరలో రైతుల అకౌంట్లో లోకి డబ్బులు వస్తాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్ రెడ్డి, లింగన్న, సతీష్ రావు, సాయి కుమార్, సురేష్ నాయక్, రాజేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love