నవతెలంగాణ – మాక్లూర్
ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలిని ఏప్రిల్ 8న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ప్రజా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ మాక్లూర్ మండలం కృష్ణ నగర్ లో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శనివారం చేశారు. అనంతరం సిపిఐ .(ఎంఎల్) న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు జి .రమేష్ , దేశెట్టి సాయిరెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసి జాతి హననానికి బిజెపికి చెందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడతెగని విధంగా హత్యాకాండ కు తెగబడుతున్నాయని అన్నారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో వందలాది మందిని ఎన్కౌంటర్ల పేరిట హత్య గావిస్తున్నారు. ఈ హత్యకాండను ప్రత్యేకించి ఆదివాసి జాతిని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం హతమారుస్తున్న విధానాన్ని దేశంలోని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు, మేధావులు, ఆలోచనపరులు తీవ్రంగా వ్యతిరేకించి ఖండించాలని అన్నారు. సి పి ఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ ఎప్రిల్ 8న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ధర్నా చౌక్ (ఇందిరా పార్క్) వద్ద మహా ధర్నా ను తలపెట్టింది. ఈ ప్రజా ధర్నా లో పాల్గొని మధ్య భారతంలోని ఆదివాసీ ప్రజానీకం జల్, జంగిల్, జామీను- ఇజ్జత్ హమారా హై” అంటూ అడవిని, అడవిలోని సహజ సంపదను రక్షించుకునేందుకు సాగిస్తున్న ఆదివాసీల విరోచిత పోరాటం పై క్రూర మారణకాండను నిరసిద్దామని అన్ని వర్గాల ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. అడవుల్లో అపారమైన ఖనిజ సంపదను, ఖనిజ నిక్షేపాలను, వనరులను రక్షించడం ద్వారానే తమ జీవిత మనుగడ ఆధారపడి ఉందని పోరాడుతున్న అడవి బిడ్డలకు కొండంత అండగా నిలబడుదాం అన్నారు. ఏప్రిల్ 8న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జరిగే ప్రజా ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో ఏఐకేఏంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు సాయినాథ్, భారతి, నర్సయ్య, శివకుమార్, సత్యం, బన్సి, శ్రీనివాస్ రెడ్డి, రాధ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.