రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ..

– ఎర్రబెల్లి గూడెం పీఏసీఎస్ చైర్మన్ పోనుగోటి దేవేందర్ రావు

నవతెలంగాణ – నెల్లికుదురు 
రైతు భరోసా కార్యక్రమం పై రైతుల అభిప్రాయ సేకరణను సేకరించినట్లు ఎర్రబెల్లి గూడెం పీఏసీఎస్ చైర్మన్ పోనుగోటి దేవేందర్ రావు ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు తెలిపారు. మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామంలోని రైతు వేదికలో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం రైతు భరోసా పథకంపై సలహాలు సూచనల కొరకై ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎర్రబెల్లి గూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కాచికల్, రామాంజపురం, ఎర్రబెల్లిగూడెం, మెచరాజపల్లి గ్రామాల రైతులతో ఎర్రబెల్లిగూడెం క్లస్టర్ రైతువేదికలో సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో హాజరు అయినా 4 గ్రామాలకు చెందిన ప్రతి ఒక్క రైతును  రైతుబంధు మీద వారి యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకొని వాటిని రిజిస్టర్లో రాసి ప్రభుత్వానికి అందజేస్తున్నట్ట తెలిపారు. రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందాలంటే వ్యవసాయ శాఖ ఆలోచనలు తీసుకొని వ్యవసాయం చేసినట్లయితే మీకు ఎంతో లాభం చేకూరుతదని అన్నారు. వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారం కోసమే ఈ రైతు వేదికలను ఏర్పాటు చేశామని అన్నారు తెలిపారు. ఏ సమస్య వచ్చినా మీకు సంబంధించిన ఏఈఓ కు తెలిపినట్లైతే ఆ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు సహకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపెడ డివిజన్ ఏడిఏ శోభన్ బాబు, నెల్లికుదురు మండల వ్యవసాయ అధికారి రవీందర్, పాక్స్ అడిషనల్ డైరెక్టర్, పాక్స్ చైర్మన్ దేవేందర్ రావు, ఎర్రబెల్లిగూడెం డైరెక్టర్లు రమేష్, వెంకటరెడ్డి, శ్రీను, కిరణ్, యాకూబ్, ఎల్లమ్మ, క్లస్టర్ ఏఈఓ చందన, సీఈఓ సుభాష్,పాక్స్ డైరెక్టర్లు, రవీందర్, మహేష్ మరియు రైతులు పాల్గొన్నారు.
Spread the love