నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ధర్నా చేపట్టారు. జూలై 20 నాటి నిరసనలో విద్యార్థులపై పెల్లెట్ గన్ లతో కాల్పులు జరిపిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు పోలీసులు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
గత నెల జూలై 20న నీట్ పేపర్ లీక్ ను వ్యతిరేకిస్తూ విద్యార్థులు పార్లమెంట్ మార్చ్ కు శాంతియుత నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులపై పెల్లెట్ గన్ లతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 19 ఏళ్ల సాహిల్ కు తీవ్ర గాయాలైయ్యాయి. శుక్రవారం బాధితునితో కలిసి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని సాహిల్ ఆరోపించాడు. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్ వెలుపల ధర్నాకు కూర్చున్నారు.



