హైదరాబాద్‌కు విస్తరించిన ఆరెంజెథియరీ ఫిట్‌నెస్‌

హైదరాబాద్‌: సైన్స్‌ ఆధారిత వ్యాయామాల ఫిట్‌నెస్‌ బ్రాండ్‌ ఆరెంజెథియరీ ఫిట్‌నెస్‌ హైదరాబాద్‌కు విస్తరించినట్లు ప్రకటించింది. బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 7లో 2400 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ్టూడియోను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు ఛబ్రియా తెలిపారు. డ్యూయల్‌ సర్టిఫైడ్‌ కోచ్‌లు వ్యక్తిగత శిక్షణ అందిస్తారన్నారు. ఇక్కడి స్టూడియోలో 8 స్టేషన్‌లు ఉన్నాయన్నారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో దేశంలో 40-50 స్టూడియోలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

Spread the love