ఆర్బిట్‌ ఫ్లైట్‌ ట్రైనింగ్‌, ఏఎంఎస్‌టీ ఏవియేషన్‌ మధ్య ఒప్పందం

ఆర్బిట్‌ ఫ్లైట్‌ ట్రైనింగ్‌, ఏఎంఎస్‌టీ ఏవియేషన్‌ మధ్య ఒప్పందంహైదరాబాద్‌ : ఆర్బిట్‌ ఫ్లైట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, ఆస్ట్రీయా దేశానికి చెందిన ఏఎంఎస్‌టీ ఏవియేషన్‌ సంస్థలు పరస్పరం ఒప్పందాలను కుదు ర్చుకున్నాయి. పైలట్‌ శిక్షణకు సంబంధించి హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్స్‌ ఇండియా 2024 ప్రదర్శనలో భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం ద్వారా పైలట్‌ శిక్షణ కోసం ఎఎంఎస్‌టి ఏవియేషన్‌ సంస్థ మూడు అత్యాధునిక ఎ320నియో, బి737 మాక్స్‌ 2024 ఎయిర్‌ ఫాక్స్‌ ఫుల్‌ ఫ్లైట్‌ సిమ్యులేటర్‌ల ట్రైనింగ్‌ సర్వీస్‌ లను ఆర్బిట్‌ ఫ్లైట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కి అందిచనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా మెరుగైన పైలట్‌ శిక్షణను అందిస్తూ.. దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుందని ఆర్బిట్‌ ఫ్లైట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ కౌశిక్‌ మానెపల్లి తెలిపారు.

Spread the love