
కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం చేపట్టిన శిక్ష సప్తాహ కార్యక్రమంలో భాగంగా ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు పాల్గొని పద్యాలు, పాటలు, చిత్రలేఖనం, నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి, తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ, ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మ, గంగాధర్, మునీరోద్దీన్, రాజ నర్సయ్య, రాజేంధర్, పవన్, ప్రసాద్, శ్రీనివాస్, ఇందిరా, సమతా, జ్యోతి పాల్గొన్నారు.