వీలైనన్ని ఉద్యోగాలు ఇవ్వడం మా ద్యేయం

Our mission is to provide as many jobs as possible– కేటీఆర్ అరెస్ట్ రంగం సిద్ధం.
– దేశంలో ఎ కుటుంబం దోచుకొని డబ్బులు కేసీఆర్ కుటుంబం దోచుకుంది.
– నీరుఉద్యోగులకు కట్టుబడి ఉంది..టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..
– ఓయూలో కృతజ్ఞత బహిరంగ సభలో వక్తలు..
– భారీగా తరలివచ్చారు విద్యార్థులు..
నవతెలంగాణ – ఓయూ:
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట శనివారం రాత్రి టీపీసీసీ అధికార ప్రతినిధి ,ఓయూ పీహెచ్డీ విద్యార్థి చేనాగని దయాకర్ అధ్యక్షత 50 వేల జాబ్స్ ఇచ్చి, జాబ్ క్యాలెండర్ ఇచ్చినందుకు  ఏర్పాటు చేసిన కృతజ్ఞత బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.  ఆర్ట్స్ కళాశాల తెలంగాణ తొలి మలి ఉద్యమలకు ఊపిరి పోసిన గడ్డ ఇక్కడి కి రావడం గర్వంగా ఉంది.మీ విద్యార్థులు, యువత వాళ్లనే మా హామీలు నమ్మి కాంగ్రెస్ ను అశ్విరదించారు. 16 సీఎం లు 72 వేల కోట్లు అప్పు చేస్తే ఒకే ఒక్క సీఎం 6 లక్షల 71వేల కోట్లు అప్పు చేశారు.నెలకు మేము 5 వేల జాబ్స్ ఇచ్చాము..కాళేశ్వరం కట్టారాని చోట కట్టారు. ఒక్క కాళేశ్వరం 30 నుండి 36 కోట్లు దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఫ్యామిలీ ఫ్యామిలి యే పోట పోటిగా దోచుకున్నారు.   అన్ని అబద్ధాలు చెప్పుతు ప్రభుత్వన్ని ఇబ్బందులు పేడుతున్నారు. కాంగ్రెస్ వచ్చాక స్కిల్ ,స్పోర్ట్స్ యూనివర్సిటీ తెచ్చాము. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యం కృషి చేస్తున్నాము. రానున్న నాలుగేళ్లలో ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలు చేస్తామన్నారు.   ప్రభుతానికి ప్రజలకు మధ్య వారధి గా గాంధి భవన్  పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహూల్ గాంధీ, ఖర్గే ,రేవంత్ రెడ్డి నాయకత్వం లో కుల గణన చేసిన ప్రభుత్వం మాది. పేదలకు ఉన్నవారికి మధ్య రెట్టింపు సంఖ్యలో దూరం పెరుగుతుంది. విలైనన్న ఉద్యోగాలు ఇవ్వడం మే మా దేయం.కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం అయ్యింది. కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్ము ప్రవేట్ వారికి ధారాదత్తం చేశారు. పద్ధతి ప్రకారం పోతాం , దేశ చరిత్రలో కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి ఎ కుటుంబం చేయలేదు. గత 10 ఏళ్ల పాలనకు మా ఒక ఏడాది పాలనపై మిరే బేరీజు వేయండి. ప్రతిపక్ష నేత ఎందుకు ఫామ్ హౌస్ ఉన్నారు.అసెంబ్లీ రారా అన్నారు.కేటీఆర్ పగటి కలలు మానండి.. వచ్చే ఎన్నికల వరకు కేసీఆర్, కేటీఆర్ తప్ప కవిత, హరీష్ రావు కూడా ఉండరు.సోషల్ మీడియా ను దొంగ తనంగా వాడుతున్నారు.ఆర్ట్స్ కళాశాల సాక్షిగా వాస్తవాలు మాట్లాడుతూన్న, ఇచ్చిన హామీలు నేర వేరుస్తున్నాము.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. విద్యార్థుల బలిదానాలు త్యాగల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.10 ఏళ్ళ లో రాష్ట్రన్ని నీళ్లు నిధులు నియమాలు లేకుండా రాబందుల దోచుకున్న వారు నేడే సోషల్ మీడియాలో అబసు పాలు చేస్తు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.ప్రజల్లో విష బీజాలు నాటుతున్నారని చెప్పారు.జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.  ఒక సంవత్సరం లో ఎంతో చేసిన చెప్పుకోలే పోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు మాట్లాడుతూ. బి ఆర్ ఎస్ హయం లో పనిచేసిన వారిని వీసీ లుగా నియమించడం నాకు నచ్చలే అన్నారు.అమిత్ షా   నిండు సభలో డా.బి.ఆర్.అంబేద్కర్ అవహేళన చేస్తు మాట్లాడం బాధాకరం అన్నారు. యం ఎల్ సి బాల్మురి. వెంకట్ మాట్లాడుతూ. నోటిఫికేషన్ జారీ చేయలేదు, చేస్తే లీక్ లు , చివర కు అడర్ కాపీలు వచ్చే వరకు ఆందోళన చెందాల్సిన దుస్థితి గత ప్రభుత్వం హయాంలో జరిగిన పరిస్థితి అన్నారు. ప్రతి కేసు ను పరిష్కారం చేసి జాబ్స్ ఇచ్చాము.మమ్మల్ని గెలిపించిన మీకు నిలదీసే హక్కు మీకే ఉంది.మెరుగైన విద్యా ను అందిస్తున్నట్లు చెప్పారు. పారదర్శకంగా జాబ్ లు ఇస్తున్నాము..గత ప్రభుత్వం 10 నుండి గ్రూపు పరీక్షల వరకు లీక్ చేయలేదా ? అంటు ప్రశ్నించారు.కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయల చైర్మన్ రియాజ్ , రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివా సేనా రెడ్డి ,  ఓయూ సివిల్ సర్వీస్ అకాడమీ డెరైక్టర్ ప్రొ.  కొండ.నాగేశ్వర్ రావు డా.దుబ్బ రంజిత్ , ఎన్ ఎస్ యు ఐ ఓయూ అధ్యక్షుడు మెడ శ్రీనివాస్, ఏపూరి సోమన్న హాజరయ్యారు.. అయిన ఆట పాట తో సభికులను       ఆకట్టుకున్నారు.సభకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు.సభకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చేనాగని దయాకర్ అధ్యక్షత వహిస్తున్నారు
Spread the love