సబ్బండ వర్గాల సంక్షేమ ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, తమది పేదల ప్రభుత్వమని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ అన్నారు. బుధవారం అక్బరుపేట భూంపల్లి మండలం తాళ్లపల్లి లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వారి వెంట మాజీ ఎంపీటీసీ పాతూరి శ్రీనివాస్ గౌడ్, కూడవెల్లి డైరెక్టర్ వేల్పుల యాదగిరి ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు బాల మల్లు, బాబు, బాలాగౌడ్, దుబ్బాగౌడ్, మహేష్ గౌడ్, నరసింహులు పలువురున్నారు.