కరపత్రం విడుదల

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు, కరపత్రంను యమ్.యల్.ఏ. అనీల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాల భువనగిరి నందు ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్ కరపత్రంను భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలను మైనారిటీ విద్యార్థులు తప్పక వినియోగించుకోవాలని సూచించారు. భువనగిరి నందు బాలురకు ఉచిత విద్య, హాస్టల్ వసతి ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మంచి ఫలితాలు సాధించి, గుర్తింపు పొందిందని,కార్పొరేట్ స్థాయిలో విద్యా వసతులు ఉన్న భువనగిరి మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో  వచ్చే విద్యా సంవత్సరానికి గాను ఫిబ్రవరి 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మైనారిటీ గురుకుల ప్రిన్సిపాల్ గండ్ర శ్రీకాంత్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ శేక్. హమీద్ పాష గారు, వార్డెన్ షానూర్ బాబా, వేదప్రకాష్, రహమత్ ఆలీ, మైనారిటీ నాయకులు మజర్,   అబేద్ ఆలీ,తంగళ్లపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్ కుమార్, పొతంశెట్టి వెంకటేశ్వర్లు,బిస్కుంట్ల సత్యనారాయణ, దేవరకొండ నర్సింహచారి, చిక్కుల వెంకటేష్, చిన్న, పాల్గొన్నారు.
Spread the love