
– జీవో 317 రద్దు కాకపోవడమే తమ పాలిట శాపం.. ఉద్యోగులు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఎం వెంకటేశ్వర్లు 45 (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ వన్ ) G.O 317 లో బాగంగా ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గుండె పోటు రావడంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంత్ రావు తెలిపారు.అయన తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వర్లు శనివారం కడుపునొప్పి తో బాధపడుతూ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుండి చికిత్స పొందుతూ కడుపునొప్పి తగ్గిందని, అర్ధరాత్రి అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పలువురు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు.G.O 317 లో బాగంగా గత మూడున్నర ఏళ్ల ల క్రితం ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామ
పంచాయతీ గ్రేడ్ వన్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉంటూ గ్రామ అభివృద్ధికి పాటు పడ్డారని గ్రామస్తులు వివరించారు. మంగళవారం స్వగ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా, మానవపాడు మండలం &గ్రామం లో మధ్యాహ్నం అంతక్రియలు నిర్వహించారు. అంతక్రియలకు ఎంపిఓ రాజ్ కాంత్ రావు,ఇతర పంచాయతీ కార్యదర్శులు తరలి వేళ్ళరు.
ఆకస్మిక మృతి బాధించింది: ఎంపిడిఓ అనంతరావు.. కార్యదర్శులు
గత మూడున్నర ఏం లెక్క నుండి మండలంలోని గన్నారం గ్రామపంచాయతీలో క్రియేట్ 1 కార్యదర్శిగా గ్రేడ్ వన్ కార్యదర్శిగా విధలు నిర్వహిస్తూ
కడుపులో నొప్పి ఉందని చెప్పి హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గుండె నొప్పి రావడం అప్పటికప్పుడే వెంకటేశ్వర్లు మృతి చెందడం బాధిస్తుందని ఎంపీడీవో అనంతరావు ,మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మండల పరిషత్ కార్యాలయం లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి రెండు నిమిషాల మౌనం పాటించాన వారిలో సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శులు తిరునగరి శ్రీధర్ , రజని, అనుష,ఎపిఓ పోశేట్టి , పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ, కార్యాలయ సిబ్బంది, తిరుపతి, సాయిలు తోపాటు తదితరులు ఉన్నారు.
జీవో 317 తోనే ఇబ్బందులు..
మృత్యువాత పడుతున్న కనికరించరా…
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో జీవో 317 తోనే తమకు ఇబ్బందులు తప్పడం లేదని పలువురు పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో వచ్చినప్పటినుండి తమ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని ఇతర మండలాల నుండి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 20 మంది వరకు వీధులు నిర్వహిస్తున్నామని గత ఎన్నికల సమయంలో 317 జీవోను రద్దు చేస్తామని అప్పటి పిసిసి అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిన నేటి వరకు ఆ జీవో రద్దు విషయమై నిర్ణయం తీసుకోలేదన్నారు. తాము స్వగ్రామాలకు వెళ్లాలంటే రెండు రోజుల సెలవు ఉంటేనే ఒకరోజు ఉండగలుగుతున్నామని ఆ రెండు రోజులు సెలవు వచ్చినప్పుడు ఏదో ఒక కార్యక్రమం ఉంటే స్వగ్రామానికి వెళ్లడం గగనమైపోతుందని పని భారం తిరిగి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కొందరి ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ కార్యదర్శులకు సైతం తమ తమ జిల్లాలకు కేటాయించే విధంగా ముఖ్యమంత్రి ప్రత్యేక కృషి చేయాలని విన్నవించారు.