మండలంలో మోషన్ పూర్ పాఠశాలకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకు, పంచాయతీ కార్యదర్శి కి గ్రామస్తులు గురువారం శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, ఏక రూపా దుస్తువులుతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చే నాణ్యమైన విద్య బోధన ఉంటుందని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.