చిన్నారెడ్డిని కలిసిన పార్ట్‌ టైమ్‌ టీచర్లు

నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షులు జిల్లెల చిన్నారెడ్డిని పార్ట్‌ టైం టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు బుధవారం కలిసి ఆరు నెలల వేతనాలు అర్ధాకాలి బతుకులతో యూనివర్సిటీ పార్ట్‌ టైం టీచర్స్‌ పడుతున్న బాధలను విన్నవించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కాంట్రాక్ట్‌గా మారకుండా గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని వివరించారు. చిన్నారెడ్డి స్పందిస్తూ పార్ట్‌ టైం టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ జానకి రెడ్డి, డాక్టర్‌ విష్ణు భూపతి, డాక్టర్‌ సుందర్‌, డాక్టర్‌ సునీల్‌,డాక్టర్‌ కర్ణాకర్‌, డాక్టర్‌ సుమన్‌ డాక్టర్‌ చందు,డాక్టర్‌ శ్రీనివాస్‌,డాక్టర్‌ అమర్‌, పాల్గొన్నారు.

Spread the love