– హెచ్.ఓ వేణుమాధవ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
సోమవారం సంభవించిన ఈదురు గాలులు,అకాల వర్షానికి మండలంలో 35 ఎకరాల్లో ఉద్యాన పంటలకు పాక్షిక నష్టం వాటిల్లినట్టు ఉద్యానాధికారి వేణు మాధవ్ తెలిపారు. ఆయన మంగళవారం పలు వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన అనంతరం విలేఖర్లతో మాట్లాడారు.మామిడి 20,అరటి 10,కూరగాయలు 5 ఎకరాల్లో నష్టం చేకూరింది అని అన్నారు.ప్రాధమిక నివేదిక ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు.