పార్టీ నిర్ణయాలు బేఖాతారు..

– భాన్సువాడలో గ్రూపులుగా మారిన కాంగ్రెస్ పార్టీ..
– సతమతమవుతున్న కార్యకర్తలు..
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
బాన్సువాడ కాంగ్రెస్‌ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తి  రేపుతున్నాయి. ఆ క్రమంలో బాన్సువాడ కాంగ్రెస్ రాజకీయం   ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ స్పీకర్, మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించడం మేరకు కాంగ్రెస్ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ను బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు కొందరు ఆహ్వానిస్తుండగా మరికొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.  బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీలో నాలుగు గ్రూపులుగా విడిపోయాయి ఇందులో పాత కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం, టిఆర్ఎస్ నుండి వలసబోయిన నాయకులు, పోచారం వర్గం లాగా ఏర్పడ్డారు. ఇందులో వలసబోయిన నాయకులు ఏనుగు వర్గీయులు కలసి పోచారంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం పోచారం సేవలను సద్వినియం చేసుకునేందుకు రాష్ట్రంలో ఉన్నత స్థానం కల్పించేందుకు సిద్ధంగా ఉండగా అలాగే పోచారం భాస్కర్ రెడ్డికి ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసక్తి చూపగా. బాన్సువాడ నియోజకవర్గంనికి కాసుల బాలరాజ్, ఆగ్రో చైర్మన్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి, పోచారం భాస్కర్ రెడ్డి కి ఉన్నత పదవులు రావడానికి కొందరు హర్షం వ్యక్తం చేయగా కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురికి మూడు పదవులు వస్తే బాన్సువాడ మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఓ వర్గంలో ఆందోళన..
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు ఏనుగు రవీందర్ రెడ్డిలు సోదర భావంతో ఉండేవారు. 2018లో  అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గ  కాంగ్రెస్ అభ్యర్థి జాజాల సురేందర్ పై ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి బాన్సువాడ నియోజకవర్గం అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డి పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందడం, టిఆర్ఎస్ పార్టీలో వర్గ రాజకీయం ఏర్పడడం, ఉమ్మడి జిల్లాలోమారుతున్న రాజకీయ సమీకరణాలో భాగంగా ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు జతకట్టి అవిశ్వాసం పెట్టి డిసిసిబి చైర్మన్ పదవికి రాజీనామా చేసేలా చేయడంతో ఓకే పార్టీలో వర్గ వివేకం బాన్సువాడలో రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇంతవరకు బాగానే ఉన్నా కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి రావడం పట్ల ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు మరియు టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కొందరు  వలసవాదులు జీర్ణించుకోలేక నిత్యం ఏదో ఒక గ్రామంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం అది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధిష్ఠానికి తలనొప్పిగా మారిందని అదే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పోచారం ధీమా ఇవ్వాలి..
గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ సమావేశంలో మాట్లాడుతూ ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలవుతాయి. మాకు కూడా ఒక రోజు మంచి రోజు వస్తుంది, అని వలసవాదులను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆవేశంతో ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని దృష్టిలో పెట్టుకొని పోచారం శ్రీనివాస్ రెడ్డిని కి నచ్చని వారు కొందరు కాంగ్రెస్ నాయకులు కొందరు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏదో అవుతుంది, కార్యకర్తలకు నష్టం జరుగుతుంది అనే నినాదంతో ప్రజలను కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పార్టీలోకి చేరిన వ్యక్తికి ఆహ్వానించడం వారితో పార్టీ బలోపేతానికి కురిచేయవలసిన నాయకులు కార్యకర్తలు విభేదాలు సృష్టించి గ్రూపులోగా మారారు. బాన్సువాడ నియోజకవర్గాల్లో పోచారం కు గట్టి పట్టుంది. కాంగ్రెస్ పార్టీలకు చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పోచారం ధీమా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Spread the love