కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలి

– ధరణితో ఆగిపోయిన పట్టాదారు పాసు పుస్తకాలు
– ప్రజావాణిలో వినతిపత్రం అందజేసిన కొత్వాల్‌ గూడ రైతులు
– ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డికి విన్నపం
నవతెలంగాణ-శంషాబాద్‌
ధరణి పోర్టల్‌ ఏర్పాటుతో ఆగిపోయిన పట్టాదారు పాసు పుస్తకాలను తిరిగి పునరుద్ధరించాలని రైతులం దరికీ కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని శంషా బాద్‌ మండల పరిధిలోని కొత్వాల్‌ గూడ గ్రామ రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడలోని మహాత్మ జ్యోతిరావు పూలే భవన్‌లో ప్రజావాణి కార్యక్రమంలో ఇన్‌చార్జి చిన్నారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు గ్రామస్తు లు మాట్లాడుతూ సుమారు వంద సంవత్సరాల క్రితం నుంచి గ్రామరైతులు భూమిని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వంశపారపర్యంగా తాత ముత్తాతల కాలం నుంచి వ్యవ సాయం చేసుకొని కుటుం బాలను పోషించుకుంటున్నారని తెలిపారు. గ్రామ రైతుల సమస్యను పరిష్కరించడానికి గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 38 ఈ కింద రైతులకు అన్ని హక్కులు కల్పిం చి పట్టాదారు పసుపుసకాలు ఇచ్చిందని తెలిపారు. దీం తో గ్రామ రైతులు హక్కులు పొంది భూమి క్రయ విక్ర యాలు జరిపే అవకాశం ఏర్పడిందన్నారు. తద్వారా రైతు రుణమాఫీ, రైతుబంధు ఇతర సదుపాయాలను పొందే వారమని తెలిపారు. గత తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తీసుకువచ్చి కొత్వాల్‌ గూడ రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటినుంచి గ్రామ రైతులకు ఎలాంటి హక్కులు లేకుం డా రైతుబంధు రైతు, రైతు బీమా ఇతర రుణ సదుపా యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలి పారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో విధించిన నిషే ధాన్ని ఎత్తివేసి గ్రామ రైతులందరికీ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందిం చిన ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం అయ్యేటట్లు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమం లో గ్రామ మాజీ సర్పంచ్‌ పి.శ్రీనివాస్‌ గౌడ్‌, పీఎసీఎస్‌ వైస్‌ చైర్మెన్‌ జ్ఞానేశ్వర్‌ యాదవ్‌, డైరెక్టర్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీవార్డ్‌ మెంబర్‌ సిద్ధాంతి కృష్ణ ముదిరాజ్‌ రాజేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love