మేడారం(రెడ్డిగూడెం)లో పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ 

– నూతన ఫెలోషిప్ మీటింగ్ కమిటీ ఎన్నిక
నవతెలంగాణ -తాడ్వాయి 
మండలంలోని మేడారం(రెడ్డిగూడెం)లో చర్చిలో బుధవారం పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ బాడీ మీటింగ్ ఘనంగా జరిగింది. నూతన కంపెనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫెలోషిప్ ప్రెసిడెంట్ గా పాస్టర్ కిషోర్, వైస్ ప్రెసిడెంట్ గా పాస్టర్ యోసేపు గారు, జనరల్ సెక్రెటరీ పాస్టర్ వై సతీష్, ట్రెజరర్ గా పాస్టర్ సత్యానంద, జాయింట్ సెక్రటరీగా పాస్టర్ జె రవీందర్, చీఫ్ అడ్వైజర్ గా పాస్టర్ కృపావరం మరియు యేసు రత్నం గారు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి ఆధ్యాత్మిక చింతన పెంపొందించే విధంగా చర్చిలకు పాటుపడతామని తెలిపారు. పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు.
Spread the love