జీపీ సిబ్బందికి బకాయి వేతనాలు చెల్లించాలి..

GP staff should be paid their arrears.– వేతనాలకు బడ్జెట్ కేటాయించాలి
– గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్, జిల్లా అద్యక్షులు బాలనర్సు
నవతెలంగాణ – కామారెడ్డి
గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ శనివారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కామారెడ్డి జిల్లా డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కి వినతి పత్రం అందజేసినట్లు  జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత తొమ్మిది నెలలుగా వేతనాలు చెల్లింపులు జరగకున్న వాటి నిర్లక్ష్యం పైన చర్యలు తీసుకోవాలని, ఎస్ టి ఓ లో నిలిచిపోయిన బకాయి చెక్కులకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగుల వలె గ్రీన్ ఛానల్ ద్వారా 2025 జనవరి నుండి వేతనాలు చెల్లించాలని, వేతనాలకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సిబ్బందికి నష్టదాయకంగా ఉన్న జీవో నెంబర్ 51 సవరించాలని మల్టీ పర్పస్ వర్కర్స్ విధానం రద్దు చేయాలని, పాత కేటగిరీలను కొనసాగించాలని కోరుతూ   తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మెమోరండం ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు 9 నెలలుగా వేతనాలు అందక అనేక ఇబ్బందులు గురవుతున్నారన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్ ఇన్సూరెన్స్ పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని లేకపోతే చలో హైదరాబాద్ నిర్వహిస్తామని దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్  జిల్లా అధ్యక్షులు బాల నర్సు, నాయకులు బి సాయిలు, రూప్సింగ్, కే సాయిలు, కిషన్, కీర్తి తదితరులు పాల్గొన్నారు.
Spread the love