ఉద్యోగులకు జీతాలు ఇస్తే.. రైతులకు అన్యాయం చేసినట్టా?

నవతెలంగాణ – మహాముత్తారం 
వేతనజీవులను ఏసీ రూమ్ లలో కూర్చొని జీతాలు తీసుకుంటున్నారు అని హరీష్ రావు అనడం వారి విజ్ఞతకే వదిలేద్దామని కాంగ్రెస్ నాయకులు రూబిన్ అన్నారు.  శనివారం నవతెలంగాణతో మాట్లాడారు. ⁠90 శాతం మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు కనీసం ఫ్యాన్ కూడా ఉండదని అన్నారు.⁠నెల నెల పనిచేసి తీసుకునే వేతనంకు సంక్షేమ పథకాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబో హరీష్ రావు కే తెలియాలి. ⁠ఉద్యోగులు అంటే తమలాగా కూలిపోయే ప్రాజెక్టులు (కాళేశ్వరం) కట్టే వాళ్ళు అనుకుంటున్నారెమో, ⁠ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళేదే ఉద్యోగులు, ఉపాధ్యాయులుఅని  తెలియజేశారు. ⁠రాక్షస రాజకీయం అంటే ఇదేనేమో ఓట్ల కోసం ఒక్కరిని నిందించి లబ్ది పొందాలనుకోవడం దుర్మార్గం, తెలంగాణ పేరు చెప్పుకొని వేల కోట్లు దండుకొని ఇవ్వాళా ఈ విధంగా మాట్లాడం దారుణమని తెలిపారు.⁠తెలంగాణ కోసం సకలజనుల సమ్మెలో పాల్గొని పోరాటాలు జరిపి తెలంగాణ తెచ్చింది వారి  కోసమె అన్నట్టుంది అని అన్నారు.⁠అయన నీటిపారుదల శాఖ మంత్రిగా కూలిపోయే ప్రాజెక్టులు కడితే అది రైతులకు అన్యాయం చేసినట్టు కదా, ఉద్యోగులకు జీతాలు ఇస్తే రైతులకు అన్యాయం చేసినట్టు ఇది ఎక్కడి విడ్డురమో తెలుపాలని ఆయన అన్నారు.
Spread the love