– సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
తుది శ్వాస వరకు సీఐఐ(ఎం) లో ఉంటూ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రా శ్రీ కాంత్ అకాల మరణం పార్టీకి తీరని లోటు అనీ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నెల 2 నుండి 6 వరకు మదురై లో నిర్వహిస్తున్న పార్టీ 24 వ జాతీయ మహాసభల్లో పాల్గొంటున్న యర్రా శ్రీకాంత్ చివరి రోజు అయిన ఆదివారం సభలోనే గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న అశ్వారావుపేట మండల కమిటీ పుల్లయ్య నేతృత్వం లో సమావేశం శ్రీకాంత్ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఆయన పలు సందర్భాల్లో చివరికంటూ పార్టీలో ఉంటానని చెప్పడం,జాతీయ మహా సభల్లో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందడం ఎంతో వేదనను కలిగిస్తుందని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీ పని చేయడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి,మండల కార్యదర్శి ప్రసాద్,మడిపల్లి వెంకటేశ్వరరావు,ముళ్ళగిరి గంగరాజు,దుర్గారావు,రాము,నాగేశ్వరరావు,సీత లు పాల్గొన్నారు.