బాలికల హాస్టల్ కి ప్రహరీ గోడ నిర్మించాలి: పీడీఎస్ యూ

Protection wall should be built for girls hostel: PDSUనవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట  జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజి దగ్గర గల ఎస్సీ బాలికల హాస్టల్ కి ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని పీడీఎస్ యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ర్యాలీ  నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు నియోజవర్గ ఇంచార్జ్  రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కి  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి పాల్గొని మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలికల వసతి గృహంకు ఉన్న ప్రహరీ గోడ కూల్చి నాలుగు  సంవత్సారాలు గడిచిన దానిని నిర్మించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి  కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే పంచాయతీ రాజ్ శాఖ అధికారులను పంపించి అంచనా వ్యయాన్ని తెలుసుకొని కూడా మూడు  సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకోవడం లేదు అని అన్నారు. ప్రహరీ గోడ లేకపోవడం వలన హాస్టల్ పక్కన కొంత మంది ప్రతి రోజు మద్యం, పొగ త్రాగుతూ విద్యార్థినులను ఇబ్బందులకు గురి  చేస్తున్నారు. విద్యార్థినులు హాస్టల్ బయట చదువుకోవాలంటే భయపడే పరిస్థితి ఉంది. ప్రభుత్వ హాస్టల్ రక్షణ ఉంటుందని రాష్ట్ర నలుమూలల నుండి తల్లిదండ్రులు పిల్లలను హాస్టల్ కి పంపిస్తే ఇక్కడ విద్యార్థినిలకు రక్షణ కల్పించలేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు స్పందించి తక్షణమే బాలికల హాస్టల్కి ప్రహరీ గోడ నిర్మాణం చేసి, హాస్టల్లో ఉన్న సమస్యలను పరిక్షరించలని పీ.డీ.ఎస్.యూ జిల్లా కమిటీ తరుపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీడీ.ఎస్.యూ డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, హాస్టల్ విద్యార్థులు, నందిని, కృష్ణవేణి,మానస, మమత,పూజ,శైలజ,శ్రావణి, అనూష, శిరీష, జ్యోతి, దీపిక, అంజలి తదితరులు పాల్గొన్నారు.
Spread the love