పాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి..

– గోవిందరావుపేట తాడువాయి మండలాల పాల ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
విజయ పాల ఉత్పత్తిదారుల రాస్తారోకో నిరసన కార్యక్రమం పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించి పాల ఉత్పత్తిదారులను ఆదుకోవాలని గోవిందరావుపేట తాడువాయి మండలాల పాల ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని పసర గ్రామంలో రెండు మండలాల విజయ పాల ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో 163 వ జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు మాట్లాడుతూ.. పాత పద్ధతిలో మాదిరిగా ప్రతి 15 రోజులకు ఒకసారి పాల బిల్లులు చెల్లిస్తూ ఆదుకోవాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల పాల ఉత్పత్తిదారులు నష్టపోతున్నారని కష్టాలను గుర్తించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. గత ప్రభుత్వ హామీ మేరకు ప్రకటించిన లీటరుకు నాలుగు రూపాయల బోనస్ను మరియు ఐదు సంవత్సరాల బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని అన్నారు. పాడి పశువుపై ఇస్తానన్న పదివేల రూపాయల గ్రాంట్ బిల్లులను వెంటనే చెల్లించి ఉత్పత్తిదారులను ఆదుకొని సంరక్షించాలన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే తామే నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ రాస్తారోకో కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. పాల ఉత్పత్తిదారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం. మద్దినేని తేజ రాజు బీజేపీ మండల అధ్యక్షులు పాల ఉత్పత్తిదారుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందిందని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాల వల్ల పాల ఉత్పత్తిదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. పాడి పరిశ్రమ ఇప్పటికే చాలా దెబ్బతిన్నదని ఈ పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యతను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయము మరియు పాడి పంటల మీదనే ఆధారపడి జీవిస్తారన్న నగ్నసత్యాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాల ఉత్పత్తిదారుల సమస్యలను గుర్తించి పరిష్కరించి పాడి పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపించాలని అన్నారు.
Spread the love