విశ్వకర్మ పథకం పై ప్రజల్లో అవగాహన కల్పించాలి

– 17న గ్రామ సభలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో  విశ్వకర్మ  పథకం పై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో విశ్వ కర్మ పథకం పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ గ్రామీణ ప్రాంతంలో ఈ  పథకాన్ని ఎక్కువగా తీసుకెళ్లాలని ఆదిశగా ఈ నెల17న గ్రామ సభలు ఏర్పాటు చేసి పథకం అవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కమిటీ సభ్యులు, అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం విశ్వ కర్మ పథకం గత 17 సెప్టెంబర్ 2023న ప్రారంభించారని పేర్కొన్నారు.ముఖ్యంగా ఏ కులస్తులైన చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారు అర్హులని,  ఇంట్లో ఉద్యోగం ఉన్నవారు  అర్హులుకారని అలాగే ఒకే ఇంట్లో ఇద్దరికి పథకం వర్తించదని  సూచించారు. లబ్ధిదారులకు శిక్షణ తదుపరి  చేస్తున్న వృత్తికి సబందించి నైపుణ్యతను పెంచే శిక్షణ తో పాటు ఉచితంగా పనిముట్లు అందించడం జరుగుతుందని తెలిపారు.తదుపరి లబ్ధిదారులకు బ్యాంకు ల నుండి రికవరీ పద్దతిలో రుణాలు అందించనున్నట్లు  పేర్కొన్నారు. జిల్లాలో బ్యాంక్ అధికారులు రుణాలు అందించేందుకు ముందుకు రావాలని అన్నారు.  విశ్వ కర్మ పథకంలో కేంద్ర ప్రభుత్వం 18 రకాల అంశాలకు సంబంధించిన పనులు అనగా వడ్రంగులు, పడవల తయారీ దారులు, ఆయుధ కవచ తయారీదారులు, కమ్మరులు,సుత్తి , ఇంకా పరికరాల తయారీదారులు, తాళాల తయారీ దారులు, బంగారం పనిచేసే వారు, కుమ్మరులు, శిల్పులు, చర్మకారులు పదరక్ష ల తయారీ దారులు, తపి పని దారులు, గంప/చాపలు/చీపురులు తయారు చేసేవారు, కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువులను చేసే వారు, క్షురకులు,పూల మాలలు అల్లే వారు, రజకులు, దర్జీలు, చేపల వలలు తయారు చేసే వారు అర్హులని అన్నారు. గ్రామీణ, పట్టణ  పేద చేతి వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఇప్పటివరకు 3916 దరఖాస్తులు అందాయని , దరఖాస్తు చేయదలచిన వారు సి.ఎస్.సి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం అవగాహన కొరకు నియమించిన అధికారులు, కమిటీ సభ్యులు గ్రామ సభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో సి.ఈఓ సురేష్,  జి.ఎం పరిశ్రమలు తిరుపతయ్య, డి.పి.ఓ యాదయ్య, ఎల్.డి.ఎం బాపూజీ, కమిటీ సభ్యులు బోబ్బా బాగ్యా రెడ్డి, సలిగేంటి వీరెందర్, అక్కిరాజు యస్వంత్, ఏ. ఎం.శ్రీచరణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love