భూ సమస్యలపై ప్రజలు దైర్యంగా పోలీస్ లకు ఫిర్యాదు చేయండి: డీఎస్పీ

నవతెలంగాణ – వేములవాడ
భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు దైర్యంగా జిల్లా పోలీస్ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయవచ్చు అని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ  మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణానికి చెందిన రెడ్డవెని గోపి అనే వ్యక్తి సిరిసిల్ల పట్టణానికి చెందిన వోతరికారి సాయిలు అనే వ్యక్తి కి 2019 సంవత్సరం లో సంకేపల్లి శివారుల్లోని 43 గుంటల భూమిని అమ్ముతానాని డబ్బులు తీసుకొని 23.1/2 గుంటల భూమిని మాత్రమే సాయిలుకు రిజిస్ట్రేషన్ చేసి మిగతా 19.1/2 గుంటలు రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది కి ఇబ్బందులకు గురి చేశాడని తెలిపారు. సాయిలు రెడ్డవెని గోపిని మిగిలిన భుమీ రిజిస్ట్రేషన్ చేయాలని లేదా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగగా రెడ్డవెని గోపి మళ్ళీ అడుగుతే చంతాను అని  సాయిలు ని బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. సాయిలు వేములవాడ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా వేములవాడ పోలీస్ లు గోపి ఫై కేసు నమోదు చేసి  రిమాండ్ కు తరలించినట్లు వేములవాడ డిఎస్పీ  తెలిపారు. భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలపై,జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడుతు ప్రజలని బయబ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు డిమాండ్ చేసే వారి నేర ప్రవృత్తి ప్రజలు ధైర్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో,డిఎస్పీ కార్యాలయంలో  లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు చేయవచ్చని అన్నారు. వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ  తెలిపారు.
Spread the love