పేరిణి నృత్యం వర్క్ షాప్ ప్రారంభం..

– తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : పేరిణి నృత్యాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ. అన్నారు. మంగళవారం రామ్ కొఠి లోని శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో పేరిణి డాన్స్ వర్క్ షాప్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది రోజులపాటు ఈ కళా ప్రదర్శనలు ఉంటాయన్నారు. పేరిణి నృత్యాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పేరుని డాన్స్ అసిస్టెంట్ లెక్చరర్ సంతోష్ విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ పాండురంగ ముతాలిక్ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని పేరిణి కళాకారులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు
Spread the love