
రూ.2లక్షలు రుణమాఫీ కానీ రైతులందరికీ వెంటనే వారి ఎకౌంట్లో రెండు లక్షల రూపాయలు జమ చేయాలని, రైతు భరోసా వానాకాలం యాసింగి రెండు కలిపి ఒకేసారి రైతులకు ఇవ్వాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో దామరచర్ల తహసీల్దార్ కి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయినా ఎన్నికల ముందు ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ రైతులందరికీ అమలు కాలేదని చెప్పారు. రైతులు రుణమాఫీ వస్తదా రాదా అనే సందిగ్ధంలో ఉన్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం కూడా లక్ష రుణమాఫీ అని కొంతమందికి మాత్రమే మాఫీ చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం లాగా కాకుండా ఈ ప్రభుత్వం మాట ఇచ్చినట్లు గా రెండు లక్షల రుణం తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల లు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రైతు భరోసా వానాకాలం వేయకుండా ఉండడం వలన కొంతమంది వ్యవసాయ రైతులు ప్రైవేట్ వడ్డీలకు తీసుకొచ్చి వ్యవసాయం చేసుకోవడం జరిగినదని చెప్పారు. అధిక వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నందున వానకాలం, యాసంగి రెండు పంటల రైతు భరోసా నిధులు ఒకేసారి విడుదల చేయాలని కోరారు. దింతో అది యాసంగి పంట పెట్టుబడులకు ఉపయోగ పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్ , రైతు సంఘం రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా నాయకులు ఎర్ర నాయక్ , కోటిరెడ్డి చంద్రకళ, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఎస్ పాపా నాయక్ , వినోద్ నాయకులు దయానంద్ ,కాజా మొహిదీన్ తదితరులు పాల్గొన్నారు.