ట్రాక్టర్ లో డీజిల్ కు బదులు పెట్రోల్ ఫిల్లింగ్…

– బంకులోనే ట్రాక్టర్ ను వదిలి వెళ్ళిన యాజమాని 

– బంకు వద్ద ట్రాక్టర్ యజమాని ఆందోళన 
– తమను బెదిరించారన్న బంకు సిబ్బంది 
– రిపేరు చేపిస్తామన్న యాజమాని 
నవతెలంగాణ – రాయికల్
డీజిల్ ఫిల్లింగ్ చేసుకోవడానికి వచ్చిన ఓ ట్రాక్టర్ లో పెట్రోల్ ఫిల్లింగ్ చేసిన సంఘటన రాయికల్ పట్టణంలోని జగిత్యాల రోడ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర హెచ్.పి పెట్రోల్ బంకు లో చోటు చేసుకుంది. తన ట్రాక్టర్ లో డీజిల్ కు బదులు పెట్రోల్ ఫిల్లింగ్ చేసిన విషయం తనకు తెలుపకుండానే ఫిల్లింగ్ చేసిన పెట్రోల్ ను బంకు సిబ్బంది తొలగించే క్రమంలో తన మిత్రుడు ఒకరు సమాచారం ఇవ్వడంతో బంకు వద్దకు వెళ్ళి చూడగా తన ట్రాక్టర్ నుండి పెట్రోల్ తొలగించి, స్థానిక ట్రాక్టర్ షో రూం మెకానిక్ తో రిపేర్ చేయడానికి ప్రయత్నించిన బంకు సిబ్బందిపై బాధిత ట్రాక్టర్ యజమాని కుర్మ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండు గంటల పాటు బంకు వద్ద సిబ్బంది,యాజమాన్యం తో తన ట్రాక్టర్ చెడిపోతే ఎవరు బాధ్యత  వహిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది ఇరువురికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ట్రాక్టర్ యజమాని సంబంధింత అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంకు సిబ్బంది తీరుపై విచారణ జరిపి బంకు పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆవేశంలో సిబ్బందిపై మండిపడిన విషయం వాస్తవమేనని తాను లోన్ తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేసి  నెల నెలా ఈఎంఐ కడుతున్నాని,ఇలా ఎందుకు డీజిల్ కు బదులు పెట్రోల్ ఫిల్లింగ్ చేశారని ప్రశ్నిస్తే యాజమాన్యం షరామామూలే అన్నట్లుగా వ్యవహరించడమే కాకుండా బయటి వ్యక్తులతో ఫోన్ చేపిస్తూ బేరసారాలకు దిగారని,తనపై పోలీసు కేసు పెడతానని బెదిరించినట్లు మల్లారెడ్డి మీడియాతో వాపోయారు.ఈ విషయం పై పెట్రోల్ బంకు సిబ్బందిని వివరణ కోరగా తాము డీజిల్ కు బదులు పొరపాటున పెట్రోల్ ఫిల్లింగ్ చేసిన విషయం వాస్తవమేనని అంగీకరించారు.అందుకు ట్రాక్టర్ కు ఏదైనా రిపేర్ వస్తే చేయిస్తామని తెలిసినప్పటికీ తమను బూతు మాటలు తిడుతూ, పెట్రోల్ పోసి కాల్చి వేస్తానని బెదిరించినట్లు బంకు సిబ్బంది తెలిపారు.కాగా ఈ విషయం పై పెట్రోల్ బంకు యాజమాని శ్రీకాంత్ స్పందించారు.ట్రాక్టర్  యాజమాని తన ఇష్టం వచ్చినట్లు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినప్పటీకి, తమ పై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ,తమ సిబ్బంది వల్ల పొరపాటు జరిగడం వల్ల సంబంధిత ట్రాక్టర్ కు ఏలాంటి రిపేర్ అయినా పూర్తి ఖర్చును భరిస్తామని తెలిపారు. ట్రాక్టర్ యజమాని మాత్రం బంకు లోనే ట్రాక్టర్ ను వదిలి వెళ్ళాడు.
Spread the love