పెట్రోల్‌ ట్యాంకర్‌కు అగ్ని ప్రమాదం !

పెట్రోల్‌ ట్యాంకర్‌కు అగ్ని ప్రమాదం !నవతెలంగాణ-ఇచ్చోడ
రామగుండం నుండి ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి వస్తున్న పెట్రోల్‌ ట్యాంకర్‌కు గురువారం నిప్పు అంటుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు, ఎస్సై తిరుపతి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో కొంతమేర మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం అగ్నిమాపక వాహనం రావడంతో అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో మంటలను అర్పేశారు. దీంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. మంటలు అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Spread the love