Friday, June 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు పీజీఈసెట్ ఫ‌లితాలు

నేడు పీజీఈసెట్ ఫ‌లితాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇంజ‌నీరింగ్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్( పీజీఈసెట్) ఫ‌లితాల‌ను శుక్ర‌వారం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు క‌న్వీన‌ర్ వెంక‌టేశ్వ‌ర‌రావు తెలిపారు. మ‌ధ్యాహ్నం 3.40 గంట‌ల‌కు ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ వి.బాల‌కిష్టారెడ్డి ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తార‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు.

ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ వివరాలతో అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి స్కోర్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫలితాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు, ఫార్మసీ కళాశాలల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఫలితాల విడుదల తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్, వెబ్ ఆప్షన్లు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ వంటి తదుపరి ప్రక్రియలకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -