Monday, September 14, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్యసభ ఎన్నికలు.. ఆయా పార్టీల అభ్య‌ర్థుల ఖ‌రారు

రాజ్యసభ ఎన్నికలు.. ఆయా పార్టీల అభ్య‌ర్థుల ఖ‌రారు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏడుగురు అభ్యర్థుల పేర్లు రాష్టాల వారీగా ప్రకటించింది. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు మధ్యప్రదేశ్‌ నుంచి అవకాశం కల్పించారు. ఇక కర్ణాటక నుంచి ఏఐసీసీ చీఫ్‌ మళ్లికార్జున ఖర్గే, పవన్‌ ఖేరా, మన్సూర్‌ అలీ, రాజస్థాన్‌ నుంచి నీరజ్‌ డాంగీ, తమిళనాడు నుంచి ప్రవీన్‌ చక్రవర్తి, జార్ఖండ్‌ నుంచి ప్రవీన్‌ ఝా కు అవకాశం కల్పించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేనుగోపాల్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

అదే విధంగా బీజేపీ కూడా త‌మ‌ అభ్యర్థులను ప్రకటించింది. పంజాబ్‌కు చెందిన పార్టీ నాయకుడు తరుణ్‌ ఛుగ్‌ మధ్యప్రదేశ్‌ నుంచి పోటీ చేయనున్నారు. కేంద్రమంత్రులు రవనీత్‌ బిట్టు, జార్జ్‌ కురియన్‌ గతంలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల నుంచి గెలవగా ఈ సారి వారికి టిక్కెట్లు ఇవ్వలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -