Magazines

సాహితి సమాచారం

1 గంట క్రితం

avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 3 నిమిషాల చదవడం

డాక్టర్ వేదగిరి రాంబాబు పురస్కారాల ప్రదానోత్సవం

భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో సింహప్రసాద్ సాహిత్య సమితి నిర్వహణలో డాక్టర్ వేదగిరి రాంబాబు పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 14న ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. ఇదే సభలో 'మా కథలు 2025' పుస్తకావిష్కరణ, సింహప్రసాద్ 8 బహుమతి నాటికలు, సలీం బహుమతి కథలు పుస్తకాలవిష్కరణ శ్రీశ్రీ కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం వుంటాయి. డాక్టర్ వేదగిరి రాంబాబు బాలసాహిత్య పురస్కారం - 2026’ డాక్టర్ కందేపి రాణిప్రసాద్‌‌కి, వేదగిరి రాంబాబు కథానిక పురస్కారం - 2026 వి. మల్లిఖార్జున్‌‌కి అందజేస్తారు. ఈసభకు డాక్టర్ కె.వి. రమణాచారి, విహారి, రామా చంద్రమౌళి, సుధామ, పత్తిపాక మోహన్, డి. రామ కోటేశ్వరరావు హాజరవుతారు.

- సింహప్రసాద్ సాహిత్య సమితి, హైదరాబాద్ 9849061668

15న రెండు పుస్తకాల ఆవిష్కరణ సభ

​వర్తన సాహిత్య వేదిక ఆధ్వర్యంలో పాలపిట్ట తెలంగాణ కవిత -2026 (కవితా సంకలనం), పాలపిట్ట కథ -2026 (కథా సంకలనం) ఆవిష్కరణ సభ ఈ నెల 15 న సాయంత్రం ఆరు గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. ఈ సభలో డా. ఏనుగు నరసింహారెడ్డి, తాటికొండాల నరసింహారావు , సిహెచ్‌. ఉషారాణి, చింతపట్ల సుదర్శన్‌, డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొంటారు.

మనుష్యులూ మనస్తత్వాలు ఆవిష్కరణ

పొత్తూరి సుబ్బారావు రచించిన ‘మనుష్యులూ మనస్తత్వాలు (కన్నవి విన్నవి అనుకున్నవి కథలు కథలుగ)’ పుస్తకం ఆవిష్కరణ ఈ నెల 16న సాయంత్రం 5.00గంటలకు హైదరాబాద్‌ శ్రీ త్యాగరాయ గానసభ కళాసుబ్బారావు కళావేదికలో జరుగుతుంది. జి.వి.ఆర్.ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ చే నిర్వహించబడే ఈ సభలో డా॥కె.వి.రమణాచారి, డా॥పులివర్తి కృష్ణమూర్తి, డా॥వై.రామకృష్ణారావు, డా॥వంశీ రామరాజు, మార్ని జానకిరామ్ చౌదరి, పెద్దూరి వెంకటదాసు, జ్యోతి వలబోజు, పొత్తూరి జయలక్క్ష్మి తదితరులు అతిథులుగా పాల్గొంటారు.

- వి.వి.రాఘవరెడ్డి, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి,

జి.వి.ఆర్‌.ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌

ధ్వని - 9

మరువం, లామకాన్‌‌లు కలిసి నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపర ‘ధ్వని - 9’వ కార్యక్రమం లామకాన్ (GVK మాల్ ఎదురు సందులో, రోడ్ నెం.1, బంజారా హిల్స్, హైదరాబాదు) వేదికగా ఈ నెల 16న సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కవి రఘు శేషభట్టార్ రచనల్లోని గర్భితమైన అర్థాలను భావస్ఫోరకంగా సూచించే ప్రతీకాత్మక శ్రవ్య, దృశ్య కళారీతులలో మనోహర రీతిలో ప్రదర్శిస్తారు. ఇదే సమావేశంలో రఘు కొత్త సంపుటి ‘లోలకం’ పుస్తకావిష్కరణ కూడా జరుగుతుంది.

- నిర్వహణ, అనుసంధానం: సుమనస్పతి రెడ్డి (96761 80802)

గురజాడ సాంస్కృతిక సమాఖ్య-విజయనగరం (ఆ.ప్ర)

'మహాకవి గురజాడ వర్ధంతి'ని పురస్కరించుకుని నవంబర్ 30న నిర్వహించే 'సాహితీ చైతన్యోత్సవం'లో భాగంగా 'జాతీయ స్థాయిలో కవితల పోటీ'కి కవితలను ఆహ్వానిస్తున్నాం. విజేతలైన 5గురు కవులకు 'గురజాడ ఉత్తమ కవితా పురస్కారం'తోపాటు, 2000 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం, జ్ఞాపిక, సత్కారం ఉంటుంది. కవులు తమ కవితల్ని అక్టోబర్‌ 25లోగా ‘డా. జక్కు రామకృష్ణ: 9441427386, మానాప్రగడ సాహితి: 9989370358 మొబైల్ నెంబర్లకు వాట్సాప్ ద్వారా పంపాలి. గతంలో ఈ 'గురజాడ కవితా పురస్కారం' పొందినవాళ్ళు పోటీకి అనర్హులు.'కవితావస్తువు' సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండాలి.

- మామిడిపాక అనిల్ కుమార్‌, డా.ఎం. వెంకటేశ్వరరావు

దీపావళి కథల పోటీ -2026

తెలుగు సాహితీవనం, రాజశేఖర్ కలికి సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథల పోటీ -2026కు గాను కథలను ఆహ్వానిస్తున్నాము. వర్తమాన సామాజిక పరిస్థితులను, మానవ సంబంధాలను ప్రతిబింబించే కథలు పాఠకులను ఆలోచింపచేసే విధంగా ఉండాలి. 2000 పదాలు మించని కథ యునికోడ్‌‌లో గూగుల్ ఫామ్ పంపాలి. మెయిల్‌ : https://tiny url.com/deepavalipoti2026, చివరి తేదీ నవంబర్‌ 2. వివరాలకు : 95050 92350.

-శాంతి కృష్ణ, తెలుగుసాహితీవనం

రాజాం రచయితల వేదిక 141వ సమావేశం

ఈ నెల 18న ఉదయం 10 గంటలకు విజయనగరం జిల్లా, రాజాంలో గల విద్యానికేతన్ పాఠశాలలో రాజాం రచయితల వేదిక 141వ సమావేశం జరుగుతుంది. ఈ సభలో రెడ్డి సంగన్నాయుడు, దన్నాన రామారావు పాల్గొంటారు.

- గార రంగనాథం, రాజాం రచయితల వేదిక, 98857 58123

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్