యోగాతో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు..

– కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
యోగాతో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని సూచించారు. యోగ అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని, మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి, వారిని నిరాశ, నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ సాధన, సివిల్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ మిజరత్, డాక్టర్ సుప్రజా, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు, నర్సింగ్ సూపర్డెంట్ రజియా, హెడ్ నర్స్ పాలిన, సహెదా, నర్సింగ్ ఆఫీసర్స్ నాగలక్ష్మి, జయలీల, అర్చనా, విశిష్ట, శైలజ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love