మొక్కల సంరక్షణ అందరి భాద్యత: కలెక్టర్‌

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
మొక్కల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకటరావు అన్నారు. శుక్రవారం వాటరింగ్‌డేను పురస్కరించుకొని  జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌లో  మొక్కలకు నీరు పోశారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవి సమీపిస్తున్నందున మొక్కలకు ప్రతిరోజూ నీటిని అందించి సంరక్షించాలని సూచించారు. అధికారులతో పాటు సమాజం కూడా భాద్యత తీసుకోవాలన్నారు. అప్పుడే ప్రతి మొక్క బతుకుద్దని తెలిపారు. పట్టణాలలో మున్సిపల్‌ కమీషనర్‌లు, గ్రామాల్లో ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించి వారంలో ఒక్కరోజైన ప్రతి మొక్కకు నీరు అందిచేలా చర్యలు తీసుకోవాలని సూచాంచారు.
Spread the love