ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన హర్రర్ -యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’. ఈ మూవీ ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌తో పాటు రెండు ప్రత్యేక గీతాలను విడుదల చేశారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు చిత్రాల టైటిళ్లను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ సినిమాలోని ప్రత్యేక గీతాన్ని కృష్ణ అభిమానుల చేతుల మీదుగా విడుదల చేశారు. కృష్ణసాయి, ప్రీతి సుందర్ ఈ గీతంలో కనిపించగా, రచన-సంగీతాన్ని దర్శకుడు సంజీవ్ మేగోటి అందించారు. మరో గీతాన్ని తెలంగాణ డీఐజీ రమణారెడ్డి విడుదల చేశారు. హీరో కృష్ణసాయి మాట్లాడుతూ, 'ఈ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అని తెలిపారు. ‘‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది` అని దర్శకుడు సంజీవ్ మేగోటి చెప్పారు.
‘పోలీస్ కంప్లైంట్` రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -



