డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో దర్శకుడు చిరంజీవి తన్నీరు రూపొందించిన చిత్రం 'నేనెవరు?. మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తమ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోందని నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి తెలిపారు. సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, అనేక కేంద్రాల్లో హౌస్‌ఫుల్ షోలతో ప్రదర్శితమవు తోందని వెల్లడించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్‌తో రోజు రోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోందని, మరిన్ని కేంద్రాల్లో చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా డా. రాజేంద్ర ప్రసాద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఇంత గొప్ప ఆదరణ అందించడం చాలా ఆనందంగా ఉందని, మంచి కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తుండటం సంతోషకరమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాను ఆదరించడం తనకు మరింత ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. దర్శకుడు చిరంజీవి తన్నీరు, నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మికి ఆయన అభినందనలు తెలిపారు.
‘నేనెవరు?కి విశేష ప్రేక్షకాదరణ
- Advertisement -
- Advertisement -



