Sunday, May 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారం బస్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి

కాటారం బస్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి

- Advertisement -


నవతెలంగాణ -కాటారం:- మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ధనవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి కాటారం మండల ఏఎంసీ చైర్‌పర్సన్ తిరుమల, కాంగ్రెస్ నాయకులు బస్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన అంశాలను వివరించారు. ఆర్టీసీ స్థల వివాదం ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వ న్యాయవాదితో చర్చించి సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక నిధుల మంజూరు విషయాన్ని రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాటారం ప్రాంత ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, స్థల వివాద పరిష్కారానికి చర్యలు తీసుకొని బస్ స్టేషన్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి సమ్మయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిషన్ నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పలువురు సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -