నవతెలంగాణ హైదరాబాద్: డాక్టర్ నీలం సంపత్ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ అనడానికి ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాలు తార్కానమని తెలంగాణ శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కుటుంబంలో ఎవరు చదువుకొని కుటుంబంలో చదువుకున్న తొలితరం వ్యక్తి డాక్టర్ నీలం సంపత్ అని తెలిపారు. తెలంగాణ తెలుగు పరిశోధక మండలి ఆధ్వర్యంలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, సోషల్ ఆక్టివిస్ట్ డా.నీలం సంపత్ రాసిన పుస్తకావిష్కరణ ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సభలో సోషల్ పర్స్పెక్టివ్స్ పుస్తకాన్ని ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ పర్స్పెక్టివ్స్ పుస్తకంలో ప్రజల భావాలు సమ్మిళితం అయ్యాయని ప్రజాస్వామ్య భావన అంటే కేవలం ఎన్నికలు కాదని ప్రజలు ఎలా ఆలోచించాలో ఎన్నికల సంఘం ఎలా ఉందో కరెక్ట్ గా నిబంధనలతో పాటిస్తున్నాయా, ఎగ్జిక్యూటివ్స్ కూడా ఎన్నికైనటువంటి వారు ఆ నిబంధనల కనుగుణంగా పనిచేస్తున్నారా ఇలా అనేక ప్రశ్నలను లేవనెత్తింది. వాటికి పరిష్కారం చూపింది. కాబట్టి అందరూ ఈ పుస్తకాన్ని చదవాలని వారు సూచించారు. ప్రత్యేక అతిథులుగా హాజరైన సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సంపత్ సమాజ దృక్కోణాన్ని ఈ పుస్తకంలో పేర్కొన్నారని డెమోక్రసీ డేంజర్ లో ఉందనేది కాదు, ఇవాళ అది ప్రస్తుతం మంచం ఎక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అనేక అంశాలను సంపత్ ప్రశ్నించారని సొసైటీకి తను తిరిగి అందించాలని కుతూహలంతో రాసినటు వంటి ఆర్టికల్స్ ని అందరూ ఆదరించాలని, చదవాలని పేర్కొన్నారు.
తెలంగాణ మీడియా అకాడమీ తొలి చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ పుస్తకం రాయక ముందు సంపత్ తో నాకు పరిచయం లేదు. పుస్తకం చదివిన తర్వాత వారి పరిచయం చాలా లోతుగా అర్థమైంది. నేను హుజురాబాద్ జమ్మికుంట పరిసర ప్రాంతాలను తిరిగిన వ్యక్తిగా ఆ గ్రామాలలో జరుగుతున్నటు వంటి అనేక అంశాల పైన డాక్టర్ సంపత్ లోతైన విశ్లేషణ చేశారని, మీడియా పైన కూడా వారు సునీశిత పరిశీలన చేస్తూ ఆర్టికల్స్ రాశారని అభినందించారు. సోషల్ మీడియాని వారు పాయిజన్ మీడియాగా పేర్కొన్నారు. కానీ, ఈ రోజున తెలంగాణలో జరిగిన బండి భగీరథ కేసు విషయంలో ఆ సోషల్ మీడియానే ప్రజల ముందు వాస్తవాలను ఉంచిందని తెలిపారు. రచయిత డాక్టర్ నీలం సంపత్ మాట్లాడుతూ సమాజం నుంచి నేను నేర్చుకున్న భావాలను తిరిగి సమాజానికి అందించేటు వంటి పనిలో ఇప్పటికే 550 కి పైగా వ్యాసాలను రాశానని అందులో కేవలం 42 మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకు వచ్చినట్టు తెలిపారు.ప్రత్యేక అతిధి ఏవీవి ప్రసాద్ అసోసియేట్ ఎడిటర్ వార్తాపత్రిక మాట్లాడుతూ సంపత్ సోషల్ పర్స్పెక్టివ్స్ అనే పుస్తకంలో నిబద్దత కలిగిన పత్రిక వ్యాసాలు నిప్పు కనిక లాంటివని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాసాలు రాయాలంటే పెన్నులో సిరా ఉంటే మాత్రం సరిపోదు, గుండెల్లో ధైర్యం ఉండాలని పేర్కొన్నారు. అలాంటి వ్యాసాలను రచించినటు వంటి సంపత్ ను అభినందిస్తూ ప్రతి ఒక్కరు ఈ పుస్తకం కొని చదవాలని సూచించారు. యువ రచయిత, లెక్చరర్ డా.నర్రా ప్రవీణ్ రెడ్డి అధ్యక్షత జరిగిన సభలో అర్విని రాజేంద్ర బాబు, ఏ పుల్లయ్య, తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఓఎస్డి కే.విద్యాసాగర్, ప్రముఖ విద్యాసంస్థల అధినేత పొదిలి కృష్ణమూర్తి, కృపాకర్, కోట సతీష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.


