రోడ్ సేఫ్టీ రూమర్స్ ఆఫ్ కిడ్నాపింగ్ ఫై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ, రూమర్స్ ఆఫ్ కిడ్నాపింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. మండలంలోని అర్గుల్ జక్రాన్ పల్లి జడ్పిహెచ్ఎస్ హైస్కూలలో విద్యార్థినీ విద్యార్థులకు రోడ్ సేఫ్టీ గురించి, వాట్సాప్ లో వస్తున్నటువంటి రూమర్ సప్ కిడ్నాపింగ్ గురించి అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఎస్ఐ తిరుపతి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love