– తెలంగాణ చౌక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ..
నవతెలంగాణ – వేములవాడ
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన కార్యక్రమానికి కవరేజ్ కి వెళ్ళిన జీ తెలుగు న్యూస్ జర్నలిస్ట్ శ్రీ చరణ్ పై పోలీస్ అధికారి సీఐ రాజేందర్ దాడికి నిరసనగా గురువారం వేములవాడ తెలంగాణ చౌక్ లో అఖిలపక్షం నాయకులు, జర్నలిస్టులు ఆధ్వర్యంలో నల్ల బ్యార్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ చౌక్ నుంచి, తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ తరలివెళ్లి, తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేసే జర్నలిస్టులపై, పోలీసులు దాడి చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు.అకారణంగా, అమాను శంగా భౌతికంగా దాడులకు పాల్ప డుతూ చొక్కా, గల్లా పట్టుకొని లాక్కె ళ్లడం అప్రజాస్వామికమని అన్నారు. నిరుద్యోగులు, విద్యార్థలు సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మీడియాపై, మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడులు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. జర్నలిస్టు శ్రీ చరణ్ పై దాడి చేసిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన వృద్ధుతం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీస్ శాఖలో పోలీసులకు ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వ దృష్టికి, ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లే విలేకరులపై పోలీసులు చేతులు చేసుకోవడం దుర్భాషలాడం సమంజసం కాదని మండిపడ్డారు. పోలీసులు అత్యు త్సాహం ప్రదర్శిస్తూ జర్నలిస్టుల పట్ల దాడులకు పాల్పడడం రాష్ట్రంలో ఎక్కడో అక్కడ అడపాదడపా జరుగుతూనే ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నిమ్మ శెట్టి విజయ్, గోలి మహేష్, ఈర్లపల్లి రాజు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, ముద్రకోల వెంకటేశం, బిజెపి పట్టణ శాఖ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు, విద్యార్థి సంఘం నాయకులు,జర్నలిస్టులు, తదితరులు ఉన్నారు.