పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

నవతెలంగాణ –  సిరిసిల్ల
సిరిసిల్ల పాలిస్టర్ వస్త్రోత్పత్తి దారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి భూపతి శుక్రవారం ప్రకటించారు. అధ్యక్షునిగా ఆడెపు భాస్కర్ ప్రధాన కార్యదర్శిగా అంకాలపు రవి  ఉపాధ్యక్షునిగా దూడం రమేష్ కోశాధికారిగా మండల బాలరాజు  సహాయ కార్యదర్శిగా బండారి అశోక్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మామిడాల భూపతి ప్రకటించారు. వారికి ఎన్నికల ధ్రువీకరణ పత్రాలను ఎన్నికల అధికారి అందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం పాలకవర్గమును వస్త్ర ఉత్పత్తిదారులు ఘనంగా పూలమాలలు శాలువాలతో సత్కరించారు.

Spread the love