
– 70 శాతం ఒండ్రు, 30శాతం బంక మట్టి
నవతెలంగాణ – మల్హర్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
గత వేసవి కాలంలో చెరువుల్లో నీళ్లు ఎండిపోయినప్పుడు అందులోని మట్టిని తీసి పంట పొలాల్లో వేసుకునేవారు. ఇప్పుడు ఈ పరిస్థితిని పాటించే రైతులు తక్కువైయ్యారు. కానీ ఈ మట్టి వలన రెండు రకాల ప్రయోజనాలు కలుగుతాయని మండల వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. చెరువు మట్టిని పొలాల్లో పోసుకోవడం వలన పంట పెట్టుబడి తగ్గి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. వర్షాలు పడ్డప్పుడు సారవంతమైన మట్టి మొత్తం వచ్చి చెరువులోకి చేరుతోంది.వేసవిలో నీళ్లు తక్కువగా ఉండడం వలన ఈ మట్టిని పూడిక తీయడం ద్వారా మళ్ళీ వచ్చే ఏడాది చెరువులో నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది. ఇక చెరువు నుంచి తీసిన మట్టిని పంట పొలాల్లో వేయడం ద్వారా అపొలాలు సారవంతమవుతాయి. చెరువు మట్టి లోటును బట్టి అందులో పోషకాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఇందులో ఆమ్ల,క్లార తత్వాలతోపాటు పురుగు మందులు,అవశేశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. చెరువు మట్టి తరలించే ముందు పూడిక స్థాయి, లోతు, విస్తీర్ణం గమనించి తీయాలి.చెరువు మట్టిలోని పోషకాల స్థాయిని గుర్తించేందుకు మట్టి పరీక్షలు చేయించాలి. ఇలా కనీసం రెండు మూడేళ్లకు ఒక్కసారి పొలంలో మట్టి నింపుకోవడం ద్వారా వర్షాల వల్ల నీటి కోతకు గురైన భూములకు చికిత్స జరుగుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. చెరువు మట్టితోపాటు, పచ్చిరొట్టె పెంచడం, పశువుల పెంట ఉపయోగించడం వంటివి చేయడం వలన భూమి గుల్లబారి నెలకు సరైన మోతాదులో పోషకాలు పెరుగుతాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
సాగుకు అనుకూలం: గ్రామాల్లో వర్షాధార చెరువులు ప్రస్తుతం అడుగంటిపోతున్నాయి. ఎండిన చెరువుల్లో 2 నుంచి 3 అడుగులు మేర పేరుకుపోయిన మట్టిని పంట పొలాల్లో వేసుకోవాలి. తరువాత ఎంబి నాగలితోపాటు రోటోవేటర్ తో కలియ దున్నాలి.ఇలా దున్నితే భూమిలో అప్పటికే ఉన్న మట్టితో ఇది కలిసిపోయి పంట సాగుకు ఇది అనుకూలంగా మారుతుంది.వర్షాలు బాగా కురిసినప్పుడు ఎత్తైన ప్రదేశాల నుంచి వర్షపు నిటితోపాటు ఇసుక,బంకమట్టి, ఒండ్రుమట్టి, వివిధ పాళ్ళల్లో కుళ్ళిన వ్యర్థాలతో కలిసి చెరువులోకి చేరుతాయి.అందులో నిరున్నంత కాలం లోపల కుళ్ళి మంచి సేంద్రియ ఏరువుగా మారుతుంది.సాధారణంగా చెరువు మట్టిలో 70 శాతం ఒండ్రు, 30 శాతం బంక మట్టి ఉంటుంది.పంటలకు అవసరమైయే నత్రజని, భాస్వరం,పోటాష్ లతోపాటు సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి.
చెరువు మట్టితో లాభాలు: చెరువు మట్టిని పొలాల్లో వేయడం ద్వారా పొలాన్ని ఆమ్లా, క్షార గుణాలతో తటస్థంగా మార్చుకోవచ్చు. నెల గుల్ల బారడంతోపాటు లవణాల గాఢత తగ్గుతుంది. సూక్ష్మ, స్తూల,పోషకాల స్థాయితోపాటు ముఖ్యంగా నత్రజనీ స్థాయి పెరుగుతుంది. చెరువు మట్టితోపాటు సేంద్రియ ఎరువులను కూడా కలిపి పొలంలో వేసుకోవడం ద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. చేరువు మట్టిలో సూక్ష్మ జీవులు కూడా ఎక్కువగా ఉంటాయి.ఇవి నెలలో పోషకాలను పెంచుతాయి. కరువు వర్షాభావ పరిస్థితులను సైతం ఎదుర్కొనే శక్తిని నెలకు అందిస్తోంది. మొక్కలు ఎత్తుగా ఆరోగ్యంగా పెరుగుతాయి.
పంట దిగుబడి పెరుగుతుంది.