పూలే జయంతిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్వర్యంలో శుక్రవారం మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ వంద ఫీట్ల రోడ్డులోగల పూలే వనంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు, జాతీయ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. రేవంత్, టీయూడబ్ల్యూజే (ఐ జే యూ) జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల రాజు, పాక సురేష్, చతుర్వేదం, సంఘ నాయకులు మహాత్మ జ్యోతిబా పూలేకు పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. పూలే ఆశయాల సాధనకు కృషి చేస్తామని నినాదాలు చేశారు. హైదరాబాద్ లో పూలే విగ్రహ ప్రతిష్టాపనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని కొనియాడారు. పూలే జయంతిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ అద్దె భవనంలో కొనసాగుతున్నందున, వెంటనే అధునాతన వసతులతో స్వంత భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.