
మహాదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక,సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి ఆదేశాల దుబ్బపేట గ్రామం అంగన్ వాడి కేంద్రంలో పోషన్ పోషన్ పక్వడా కార్యక్రమాన్ని అంగడ్ వాడి టీచర్ సి.హెచ్ సత్యవతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు పోషకాలు ఎక్కువ ఉండే ఫుడ్ చిన్నారులు, గర్భిణులు, తల్లులు తీసుకోవాలని సూచించారు. అంగన్ వాడిల్లో అందజేస్తున్న బాలామృతం, కోడిగుడ్డు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భిణులు, మహి ళలు, చిన్నారులకు ఆరోగ్యకరమైన, పోహకాహారాన్నీ ప్రోత్సహించడమే పోషన్ పక్వడా ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో ఆయా తల్లులు, చి న్నారులు పాల్గొన్నారు.