నవతెలంగాణ-హైదరాబాద్: రాజస్థాన్ జైపూర్ లో నీట్-పీజీ రద్దు అయింది. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) వర్గాలు తెలిపాయి. జైపూర్‌లో ఐఓఎన్ డిజిటల్ జోన్ సితాపుర-2 పరీక్షా కేంద్రంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ కేంద్రానికి కేటాయించబడిన అభ్యర్థులందరికీ వచ్చే నెల సెప్టెంబర్ 5న పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. సదురు కేంద్రంలో దాదాపు 300 మంది అభ్యర్థులకు రీ ఎగ్జామ్ కు హాజరు కావాల్సి ఉంది.
ఆదివారం దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) (నీట్) పీజీ- 2026 పరీక్ష ప్రారంభమైంది. ఈ పరీక్షను ఎన్‌బిఇఎంఎస్ (NBEMS) కంప్యూటర్ ఆధారిత విధానంలో ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించారు. పలు నగరాల్లోని ఆయా పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు తరలివచ్చారు. దాదాపు 2.73 లక్షలకు పైగా వైద్య విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.



