
ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేసి ఆచరణలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరెల్లి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనుముల మండలం మరియు తిరుమలగిరి సాగర్ మండలంలో వివిధ ఐకెపి సెంటర్లను పరిశీలించి రైతులను అడిగి తెలుసుకున్నారు రైతులు విత్తనం నాటినుండి పంట నమ్మే వరకు అనేక రూపాల్లో దోపిడి కి గురవుతున్నారని తీరా పంట అమ్ముకునే ముందు ఐకెపి సెంటర్ల రైతులకు మాత్రమే బోనస్ ధర అందిస్తున్నారని రైతులు ఐకెపి సెంటర్లో వారం రోజులపాటు ఎండ పెట్టాలంటే వర్షాలతో తడిసి ముద్ద అయితే పూర్తిగా నష్టపోతామని అందుకే మిల్లర్లలో అమ్ముతున్నామని చెప్పారు కావున ప్రభుత్వం మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా బోనస్ ధర అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్ రెడ్డి రెడ్డి నాగిరెడ్డి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు రైతులు వెంకన్న యాదగిరి రాములు తదితరులు ఉన్నారు.