వైభవంగా ప్రాణ ప్రతిష్ట శోభాయాత్ర 

– మండల వ్యాప్తంగా అయా గ్రామాల్లో ప్రత్యేక పూజలు
– దర్శించుకున్న సర్పంచ్, పీఏసీఎస్ చైర్మన్ 
నవతెలంగాణ – బెజ్జంకి
అయోధ్య బాల రామ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్బంగా మండలంలోని అయా గ్రామాల్లో ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి వైభవంగా రాముడు ,సీత, లక్ష్మణ ప్రతిమలతో  శోభాయాత్ర నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలోని హనుమాన్ భక్త బృందం అధ్వర్యంలో ప్రధాన వీదులగుండా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు ప్రాణ ప్రతిష్ట ప్రత్యేక శోభాయాత్ర నిర్వహించారు. సర్పంచ్ ద్యావనపల్లి మంజుల, పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు శోభాయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.అయా గ్రామాల్లోని ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.రాముడు,లక్ష్మణుడు,హనుమాన్,మహర్షి వేషధారణలు,మహిళల కోలాటం శోభాయాత్రలో ప్రత్యేకార్షణగా నిలిచాయి.అయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love